ఫిట్స్‌తో బస్టాండులో ఓ వ్యక్తి మృతి

by Aamani |   ( Updated:2020-06-29 23:55:47.0  )
ఫిట్స్‌తో బస్టాండులో ఓ వ్యక్తి మృతి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బస్టాండులో ఫిట్స్ తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని వ్యక్తి నిర్మల్ బస్టాండ్ లో సోమవారం రాత్రి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ సమయంలో బస్టాండ్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులు ఇది గమనించి వెంటనే ఆ వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story