- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుశాంత్‌పై విష ప్రయోగం?

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఇప్పటికే రెండు నెలలు పూర్తి కాగా.. రోజుకో ట్విస్ట్‌తో కేసు ముందుకు సాగుతోంది. ముందుగా సుశాంత్‌ది ఆత్మహత్యే అని ముంబై పోలీసులు నిర్ధారించగా.. అభిమానులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని చెప్పారు. దోషుల విషయానికొస్తే ముందుగా బాలీవుడ్ ప్రముఖులు దావూద్ గ్యాంగ్‌తో కలిసి సుశాంత్‌ను మర్డర్ చేశారని, సుశాంత్ లవర్ రియానే ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉంటుందని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది.
సుశాంత్ విష ప్రయోగం వల్లే చనిపోయాడని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. సుశాంత్ హంతకుల నిజ స్వరూపం మెల్లగా బయటపడుతుందని అన్నారు. సుశాంత్ కడుపులో ఉన్న విషద్రవాల గురించి బయట పడకుండా ఉండాలనే పోస్ట్‌మార్టం ఆలస్యం అయ్యేలా చేశారని అన్నారు. ఆరుగంటల లోపు పోస్ట్‌మార్టం జరిగితే విష ద్రవాల గురించి బయటపడే చాన్స్ ఉండేదని.. ఆ తర్వాత ద్రవాలు కడుపులోని జీర్ణద్రవాలతో కలిసిపోతాయని అన్నారు. సుశాంత్ పోస్ట్‌మార్టం తను చనిపోయిన 12 గంటల తర్వాత జరిగిందని, అందుకే హంతకుల పన్నాగం బయటపడలేదన్నారు సుబ్రహ్మణ్య స్వామి.