‘గంటలో సెంచరీ.. మాట నిలబెట్టుకున్న బద్రి’

దిశ, స్పోర్ట్స్: ‘నేను ఈ మ్యాచ్‌లో సెంచరీ కొడతా’ అని చెప్పి మరీ సుబ్రహ్మణ్యం బద్రినాద్ శతకం బాదాడని లక్ష్మీపతి బాలాజీ తెలిపాడు. అయితే ఇది ఎప్పుడు, ఏ సందర్భంలో చేశాడన్న విషయాన్ని బాలాజీ ఒక యూట్యూబ్ ఛానల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు వెల్లడించాడు. ‘రంజీ క్రికెట్ ఆడే రోజుల నుంచే నాకు బద్రినాథ్ తెలుసు. అప్పట్లో అతడు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసేవాడు. అయితే అతడి బ్యాటింగ్‌లో మరో కోణం కూడా ఉందని తర్వాత తెలిసింది. పరిస్థితులకు బట్టి బద్రి ఆడతాడు. ఒకసారి రంజీ మ్యాచ్ సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ సెషన్‌లోనే సెంచరీ బాదుతానని తనతో చెప్పి గంటలోనే సెంచరీ చేశాడు. మరోసారి మహారాష్ట్రలో డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రికి వెళ్లి.. అంబులెన్సులో తిరిగి వచ్చి మరీ సెంచరీ చేశాడు. అది బద్రీకి ఆట మీద, తన జట్టుపైన ఉన్న ప్రేమ’ అని బాలాజీ చెప్పాడు.

Advertisement