- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అటవీప్రాంతం నుంచి బయటపడ్డ ‘పుష్ప’ యూనిట్
దిశ, సినిమా: ‘అల వైకుంఠపురంలో’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో బన్ని లారీ డ్రైవర్‌గా, కన్నడ బ్యూటీ రష్మిక మందన చిత్తూరుకు చెందిన గిరిజన యువతిలా కనిపించనున్నారు.
ఇక కొవిడ్ వల్ల పలుసార్లు వాయిదా పడ్డ షూటింగ్ ఎట్టకేలకు నవంబర్‌లో షురూ అయింది. అప్పటి నుంచి తూర్పుగోదావారి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్న మూవీ యూనిట్.. తాజాగా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్‌కు సంబంధించి తమకు సహకరించిన గిరిజనులకు మూవీ యూనిట్ థాంక్స్ చెప్పింది. గిరి‘జనాల’ సహకారం లేకపోయుంటే ఇంత త్వరగా సీన్ల చిత్రీకరణ జరిగేది కాదని తెలిపిన మేకర్స్.. త్వరలోనే మళ్లీ రంపచోడవరం, మారేడుమిల్లికి వస్తామని పేర్కొన్నారు.