బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

by Anukaran |   ( Updated:2021-04-28 00:31:47.0  )
బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటీకే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో కరోనా బారిన పడ్డారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని బన్నీనే ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. “నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది.. నేను ఐసోలేషన్ లో ఉన్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా అభిమానులు, నా మంచి కోరేవారు నా గురుంచి భయపడవద్దు.. నేను బానే ఉన్నాను. అందరు ఇళ్లలోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బన్నీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Advertisement

Next Story