- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనరల్ నాలెడ్జ్.. బిట్ పాయింట్స్ (పోటీ పరీక్షల ప్రత్యేకం)
కాంతి వేగంతో పోలిస్తే ధ్వని వేగం అతి స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కొద్దిసేపటికి ఉరుము వినిపిస్తుంది.
వివిధ పదార్థాల ధ్వని వేగం
రబ్బర్‌తో పోలిస్తే ఉక్కు స్థితిస్థాపకత ఎక్కువ కాబట్టి రబ్బరులో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది.
ద్రవ, వాయు పదార్థాలలో ధ్వని తిర్యక్ తరంగాల రూపంలోను, గాలిలో అనుదైర్ఘ్య తరంగాల రూపంలోనూ ప్రయాణిస్తుంది.
తొలిసారిగా గాలిలో ధ్వని వేగాన్ని ప్రయోగాత్మకంగా అమెరికా శాస్త్రవేత్త మిల్లర్ నిర్దారించారు.
ధ్వని వేగం ఘనపదార్థాల్లో గరిష్టంగా, ద్రవపదార్థాల్లో సాధారణంగా, వాయు పదార్థాల్లో కనిష్టంగా ఉంటుంది.
అనునాదం
సమాన సహజ పౌనః పున్యాలు ఉన్న రెండు వస్తువుల్లో మొదటి వస్తువును కంపింప చేస్తే దాని ప్రభావం వల్ల రెండో వస్తువు గరిష్ట శబ్ద తీవ్రతతో కంపిస్తుంది. దీనినే అనునాదం అంటారు.
ఉదా: పిల్లన గ్రోవి, రేడియో, ఈల అనునాదం ఆధారంగా పనిచేస్తాయి.
వంతెన (బ్రిడ్జి)లపై సైనికులను సాధారణ నడకతో దాటమంటారు. దీనికి కారణం కవాతు చేస్తూ నడిస్తే, కవాతు పౌనఃపున్యం, వంతెన పౌనఃపున్యం సమానమై అను నాదంతో వంతెన కంపన పరిమితి అధికమై వంతెన కూలిపోయే ప్రమాదముంది.
ఒక వేళ బ్రిడ్జి కింద నీరు ప్రవహిస్తే దాని సహజ పౌనఃపున్యం మారడం వలన అనునాదం ఏర్పడదు. కావున బ్రిడ్జి కూలదు.
బాంబు పేలినప్పుడు దానికి దగ్గరలో ఉన్న ఇల్లు కూలిపోవడం లేదా బీటలు రావడం జరుగుతుంది.
విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ఇండ్లల్లో కిటికీలు కొద్దిగా కంపించడానికి కారణం అనునాదం
సహజ కంపనాలు
ఒక వస్తువును కంపింపజేసి వదిలినప్పుడు అది చేసే కంపనాలను సహజ కంపనాలు అంటారు.
బలాత్కృత కంపనాలు: బాహ్య ఆవర్తనాల కంపనాల ప్రభావంతో కంపించడాన్ని బలాత్కృత కంపనాలు అంటారు.
అవరుద్ధ కంపనాలు
కాలంతో ఆగిపోయే కంపన పరిమితులున్న కంపనాలను అవరుద్ధ కంపనాలు అంటారు.