ఇండియన్ హిస్టరీ: హోమ్ రూల్ ఉద్యమం (గ్రూప్స్.. స్పెషల్)

by Harish |
ఇండియన్ హిస్టరీ: హోమ్ రూల్ ఉద్యమం (గ్రూప్స్.. స్పెషల్)
X

తొలి హోమ్‌రూల్ లీగ్‌ను తిలక్ బాంబే ప్రెసిడెన్సీలో స్థాపించాడు.

ఉద్యమానికి కారణాలు

1914 లో ప్రారంభమైన తొలి ప్రపంచ యుద్ధాన్ని ఒక అవకాశంగా చేసుకుని బ్రిటిష్ వారిపై ఒత్తిడి పెంచి కొన్ని రాజకీయ ప్రయోజనాలను పొందుటకు ఉద్యమం అవసరమని అనిబిసెంట్ భావించింది.

దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షులైన అనిబిసెంట్ మొట్టమొదటి సారిగా 1915 బాంబే సమావేశంలో హోమ్‌రూల్ ఉద్యమ ప్రతిపాదన చేసింది.

ఇంగ్లాండ్ ఇతర వలసలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో స్వయం పరిపాలన అమలులో ఉంది.

అటువంటిది భారతీయులకు స్వయం పరిపాలన ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని అనిబిసెంట్ అభిప్రాయపడింది.

ఇంగ్లీష్ విద్యా విధానం భారతీయ సంస్కృతిని విలువలను దెబ్బతీసేదిగా పరిణమించింది.

ప్రత్యామ్నాయంగా స్వదేశీ విద్య ప్రాధాన్యతను చాటవలసిన అవసరాన్ని అనిబిసెంట్ గుర్తించింది.

ఉద్యమ గమనం

మద్రాస్‌లో అనిబిసెంట్ తన హోమ్‌రూల్ లీగ్ స్థాపించింది.

న్యూ ఇండియా, కామన్‌వీల్ అనే పత్రికల ద్వారా హోమ్‌రూల్ భావాలను ప్రచారం చేసింది.

హిందూ లాల్ యాగ్నిక్, జార్జి అరుండల్, బిపి వాడియాలు ఉద్యమానికి మద్దతు పలికారు.

ఉద్యమంలో భాగంగా జాతీయ కళాశాలలు పాఠశాలలు స్థాపించబడ్డాయి.

జాతీయ విద్యను బోధించుటకు అనిబిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాల స్థాపించింది.

జిల్లా స్థాయిలో గ్రంథాలయాలు, పఠనాలయాలు స్థాపించబడ్డాయి.

స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు స్థాపించబడ్డాయి.

1917 గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫోర్డ్ ఆగస్టు ప్రకటనను అనుసరించి ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి స్వయం పరిపాలన ఇవ్వబడుతుందని ప్రకటించబడింది.

దీనిని విశ్వసిస్తూ అనిబిసెంట్ ఉద్యమాన్ని నిలిపి వేసింది.

ఉద్యమ ఫలితాలు

కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకమైన నాయకత్వం లేని సమయంలో ఉద్యమం నాయకత్వాన్ని అందించింది.

స్వదేశీ విద్య, సామాజిక సేవ ప్రాధాన్యతను ఉద్యమం తెలియజెప్పింది.

మోతీలాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా వంటి నూతన నాయకత్వాన్ని ఉద్యమం అందించింది.

స్వాతంత్య్రోద్యమంలోకి అప్పటి వరకు ప్రవేశించని సింధీలు తొలిసారిగా ఉద్యమం లోకి ప్రవేశించారు.

ఉద్యమం ద్వారా స్త్రీలు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం మరింత పెరిగింది.

1917 కలకత్తా ఐఎన్‌సీ సమావేశానికి మేడం అనిబిసెంట్ అధ్యక్షత వహించింది.

ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంట్..

ఉద్యమం వలన స్వయం పరిపాలన దిశగా సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి.

1919 మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలతో ద్వంద ప్రభుత్వం ఏర్పరచబడి 6 శాఖలు భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed