ఇండియన్ హిస్టరీ .. న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు

by Harish |   ( Updated:2023-05-02 10:11:17.0  )
ఇండియన్ హిస్టరీ ..  న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు
X

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీతో పాటు హిస్టరీకి సంబంధించి అడిగే ప్రశ్నలు.. ఎక్కువగా ఆధునిక భారతదేశ చరిత్ర నుంచే అడగడం మనం గమనించవచ్చు. ఈ విషయం ప్రీవియస్ పేపర్లు చూస్తే స్పష్టమవుతుంది. అభ్యర్థులు దీనిని గమనించి ముందుగా మోడ్రన్ ఇండియన్ హిస్టరీ పూర్తి చేస్తే మంచి ఫలితాలుంటాయి. అందుకు తగినట్లుగా దిశ కెరీర్‌లో ఇండియన్ హిస్టరీ చాప్టర్ వైస్ గా ముఖ్యాంశాలను అందిస్తున్నాం... అభ్యర్థులు దీనిని ఉపయోగించుకొని మంచి ర్యాంకు సాధించాలని కోరుకుంటూ ఇండియన్ హిస్టరీ.. ఆధునిక భారతదేశ చరిత్రలోని న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు.. మీకోసం.

న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు:

ఆర్యుల సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసింది - వైదేహుడు

ఆర్యుల సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసింది - అగస్త్యుడు

మద్రాస్‌ రాష్ట్రం లేదా ద్రవిడ ప్రాంతంలో బ్రాహ్మణుల ఆధిపత్యం అధికంగా ఉండేది.

20వ శతాబ్ధం ప్రారంభంలో మద్రాస్‌లో బ్రాహ్మణులు కేవలం 3శాతం ఉండేవారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో 90% బ్రాహ్మణులు ఉండేవారు.

1916 నవంబర్‌లో బ్రాహ్మణేతరుల అభివృద్ధి కొరకు మద్రాసులో ఒక సభ నిర్వహించబడింది.

ఈ సభలోనే 1916 నవంబర్‌ 20న బ్రాహ్మణేతరుల అభివృద్ధి కొరకు “దక్షిణ భారత ప్రజల సంఘం” అనే సంస్థ ఏర్పాటు చేయబడింది.

దీని స్థాపనలో కీలకపాత్ర పోషించిన వారు - పి. త్యాగరాయశెట్టి, ముదలియార్‌, టి.యం. నాయర్‌.

1917 ఫిబ్రవరిలో ఈ సంస్థ 'జస్టిస్‌' అనే పేరుతో పత్రికను ప్రచురించింది.

1917 జులైలో బ్రాహ్మణేతరుల అభివృద్ధి కొరకు 'జస్టిస్‌' పార్టీ వర్చాటు చేయబడింది.

ఇది భారతదేశంలో బ్రాహ్మణుల కు వ్యతిరేకంగా స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ.

జస్టిస్‌ పార్టీ మొదటి నమావేశం జరిగినది - కోయంబత్తూరు.

ఆంధ్రలో జస్టిస్‌ పార్టీ మొదటి సమావేశం - బిక్కవోలు (తూర్పు గోదావరి జిల్లా)

జస్టిస్‌ పార్టీ బాహ్మణేతరుల సమస్యలను బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియజేయుటకై కె. వి.రెడ్డినాయుడు, పానగల్లు రాజ మొదలగువారి నేతృత్వంలో ఒక సెలెక్ట్‌ కమిటీని ఏర్పాటుచేసి లండన్‌కు పంపింది.

ఈ సెలెక్ట్‌ కమిటీ బ్రాహ్మణేతరుల సమస్యలను వివరించి వాటికి పరిష్కార మార్గాలను చూపవలసిందిగా విజ్ఞప్తి చేసింది.

తక్షణమే బ్రిటిష్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

అప్పటి నుండి జస్టిస్‌ పార్టీ బ్రిటిష్‌ వారి అన్ని చట్టాలను స్వాగతించింది.

1919 చట్టం ప్రకారం 1920లో ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో జస్టిస్‌ పార్టీ 63 సీట్లు గెలుచుకొని మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సుబ్బరాయలు రెడ్డియార్ జస్టిస్‌ పార్టీ తరవున మద్రాన్‌ ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇతను బ్రహ్మణేతరుల అభివృద్ధి కొరకు అనేక చర్యలు తీసుకున్నాడు

ఉదా : 1. బ్రాహ్మణేతరులకు విద్యా, ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించుట.,

2. బ్రావ్మాణేతరుల విద్యార్థులకు, స్కాలర్‌షిప్‌లు, బుణాలు ఇచ్చుట మొదలైనవి.

1921లో సుబ్బరాయలు రెడ్డియార్‌ ఆరోగ్యం క్షీణించడంతో రాజీనామా చేశాడు.

దీంతో పి. రామరాయనింగార్‌ / రాజా రమణీయం మద్రాస్‌ ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇతను కూడా బ్రాహ్మణేతరుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాడు.

కానీ ఇవి విఫలం అయ్యాయి. ఫలితంగా 1928 ఎన్నికలలో జస్టిస్‌ పార్టీకి 44 సీట్లు మాత్రమే వచ్చాయి.

రామరాయనింగార్‌ మరలా ముఖ్యమంత్రి అయ్యాడు.

సి.ఆర్‌ దాస్‌ మరియు మోతీలాల్‌ నెహ్రూలు స్థాపించిన స్వరాజ్‌ పార్టీ కార్యకలాపాలు 1923లో మద్రాస్‌ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి.

1926లో జరిగిన ఎన్నికలలో జస్టిస్‌ పార్టీ కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

స్వతంత్ర అభ్యర్థి అయిన సి. సుబ్బరాయన్‌ జస్టిస్‌ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు.

ఈ సమయంలో ఇ. వి. రామస్వామి నాయకర్‌ /ఇ.వి.ఆర్‌(పెరియార్‌) మద్రాస్‌ రాష్ట్రంలో ప్రముఖ బ్రాహ్మణేతర నాయకుడు. ఇ. వి.ఆర్‌ పత్రికలు - కుడి అరసు, విధుతులై

ఇ. వి.ఆర్‌ 1929లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి హిందూ దేవుళ్లు అయిన రాముడు, కృష్ణుడు తమ దేవుళ్లు కాదని భిన్నమైన చరిత్ర, సంస్కృతి, భాష కలిగిన ద్రవిడ ప్రాంతంలో ఆర్యుల ఆధిపత్యం చెల్లదని బ్రాహ్మణులను హెచ్చరించాడు.

1987లో జరిగిన ఎన్నికలలో ఐ.యన్‌.సి విజయం సాధించింది. రాజాజీ మద్రాస్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. 1938లో ఇ.వి.ఆర్‌ హిందీ - హిందూ వద్దే వద్దు అనే ఉద్యమాన్ని చేపట్టాడు.

1938 సేలం సభలో భారతదేశం నుండి విడిపోయి ద్రవిడ దేశం ఏర్పడాలని ఇ.వి.ఆర్‌ డిమాండ్‌ చేశాడు.

1940- కాంచీపురం సభలో ద్రవిడ దేశంనకు ద్రవిడనాడు అను పేరు పెట్టి ఒక ద్రవిడ పటంను కూడా విడుదల చేశాడు.

మొత్తం దక్షిణ భారతదేశం (హైదరాబాద్‌ సంస్థానం మినహాయించి), బెంగాల్‌లోని కొన్ని తీరప్రాంతాలు ద్రవిడనాడు కిందికి వస్తాయని పేర్కొన్నాడు.

1940 ఈరోడ్‌ సభలో జిన్నా యొక్క పాకిస్తాన్‌ డిమాండ్‌కు మద్దతు పలికాడు.

1941లో జిన్నా ద్రావిడనాడుకి మద్దతు పలికి దానికి ద్రావిడిస్తాన్‌ అని పేరు పెట్టాడు.

రెండవ ప్రపంచ యుద్ధం, అనేక ఇతర కారణాల వల్ల ఇ. వి.ఆర్‌ 1941లో ద్రవిడనాడు ఉద్యమాన్ని నిలిపివేశాడు.

ప్రత్యక్ష ఆందోళనలను నిలిపివేసిన ఇ.వి.ఆర్‌ ఢిల్లీలో రాజకీయ పార్టీలు, అగ్ర నాయకుల మధ్ధతును కూడగట్టుటకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

జస్టిస్‌ పార్టీని పునరుద్ధరించడం అసాధ్యం అని భావించిన ఇ. వి.ఆర్‌ 1944లో జస్టిస్‌ పార్టీని రద్దు చేసి దాని స్థానంలో “ద్రవిడ కజగం” అనే పార్టీని స్థాపించాడు.

ద్రవిడ కజగం తమిళ జాతీయవాదాన్ని వ్యాప్తి చేసింది.

1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశం అయిన తర్వాత కూడా తమిళ ప్రజలు ద్రవిడనాడు దేశ డిమాండ్‌ చేశారు.

ఇ.వి.ఆర్‌ మణియమ్మన్‌ అనే మహిళను వివాహమాడాడు. దీనితో ద్రవిడ కజగం పార్టీలో చీలిక ఏర్పడింది.

1949లో అన్నాదురై ద్రవిడ కజగం పార్టీ నుండి బయటకు వచ్చి డి.యం.కె(ద్రవిడ మున్నేట కజగం) అనే పార్టీని స్థాపించాడు.

డి.యం.కె కూడా ద్రవిడనాడును డిమాండ్‌ చేసింది.

1962లో చైనా దాడి తరువాత తమిళ ప్రజలు తమ ద్రవిడనాడు డిమాండ్‌ను విరమించుకున్నారు. అన్నాదురైకు ప్రధాన అనుచరులు - కరుణానిధి, యం.జి.ఆర్‌(యం.జి రామచంద్రన్‌)

అన్నాదురై మరణానంతరం కరుణానిధి డియం.కె కు నాయకత్వం వహించాడు.

దీనితో 1972లో యం.జి రామచంద్రన్‌ డి.యం.కె నుండి బయటకు వచ్చి ఆల్‌ ఇండియా అన్నా డి.యం.కె ను స్థాపించాడు.

తమిళనాడులోని డి.యం.కె, ఎ.ఐ.ఎ.డి.యం.కె రెండు రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండించాయి.

Advertisement

Next Story

Most Viewed