- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఔను.. ‘హ్యపీ’ జర్నీనే.!
దిశ, వెబ్‌డెస్క్: విజ్ఞాన విహారయాత్రలో ప్రయాణం చేస్తుంటే.. ప్రకృతితో మమేకమవుతాం. కొత్త కొత్త ప్రదేశాలను చూసి పరవశించిపోతాం, కాలాన్ని మరిచి ప్రతీ క్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాం. అందుకే ఏ యాత్రయినా.. మన మనసుల్లో చెరగని ముద్రవేసి, మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. మరి ట్రావెలింగ్ ఇష్టపడని వాళ్ల పరిస్థితి ఏంటి అంటారా? ట్రావెలింగ్ నెమ్మదిగా అలవాటు చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎందుకంటే తరచుగా ట్రావెలింగ్ చేసేవాళ్లు చాలా సంతోషంగా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
సాధారణంగా ఎవరైనా ఊరికి బయలుదేరుతుంటే.. మనం ‘హ్యాపీ జర్నీ’ అని చెబుతుంటాం. మనవాళ్లు క్షేమంగా ఇల్లు చేరాలనే ఉద్దేశంతో ఆ పదం వాడుతుంటాం. అయితే.. జర్నీ చేయడం వల్ల నిజంగానే మన జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని ‘టూరిజం అనాలిసిస్’ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. తరచుగా వెకేషన్స్‌కు వెళ్లేవారు, అసలు ఎలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయని వారితో పోల్చితే 10 శాతం హ్యాపీగా ఉన్నట్లు ఇందులో తేలింది. 500 మందిపై ఈ అధ్యయనం జరగగా, అందులో ఎక్కువమంది ఏడాదిలో రెండుకు పైగా ట్రిప్స్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. ట్రావెలింగ్ తమలో పాజిటివ్ వైబ్స్ కలిగిస్తుందని, ప్రతి జర్నీ కూడా ఓ కొత్త అనుభూతిని అందివ్వడంతో పాటు ఆలోచనల్లోనూ మార్పును తీసుకొస్తుందని తెలిపారు.
రెగ్యులర్ లైఫ్ నుంచి కాస్త రిలాక్స్ తీసుకుని ప్రయాణాలు చేయడం వల్ల మళ్లీ ఓ కొత్త లైఫ్ ప్రారంభించినట్లు ఉండటంతో పాటు జీవితంపై ప్రేమ పెరుగుతుందని సైకాలిజిస్ట్‌లు చెబుతున్నారు. ‘ఫ్యామిలీ లైఫ్, ఫ్రెండ్స్, వర్క్ వంటి విషయాలు మనం సంతోషంగా ఉంచడంలో కీ రోల్ పోషిస్తుండగా, ప్రయాణ అనుభవాలు మాత్రం మన ఆత్మసంతృప్తికి కారణమవుతాయి. అంతేకాదు ట్రావెలింగ్ మన జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చున్ చూ చెన్ చెబుతున్నాడు.