- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ ముట్టడిలో తోపులాట..
దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులను 6.69శాతం నుంచి 30శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. మూడో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ముట్టడిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నించిన తోపులాట జరిగింది.ఈ క్రమంలో పోలీసులు నిరసన కారులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలవ్వగా అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ..రాష్ర్టంలోని పలు యూనివర్సిటీల్లో ఏండ్ల కొద్ది వైస్ ఛాన్సులర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలన్నారు.జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 5,075 లెక్చరర్ పోస్టులు, డిగ్రీ కళాశాల్లోని 2,100 పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ పేరిట ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. విద్యార్థులను ప్రైవేలు విద్యాసంస్థలు ఫీజుల పేరిట దోచుకోకుండా కఠినమైన ఫీజు నియంత్రణ చట్టం తేవాలని కోరారు. అంతేకాకుండా ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలన్నారు. గత హామీల కనుగుణంగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించిన 1లక్షా7వేల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్స్ జారీ చేసి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు తెలిపారు.
Tags: students, Abvp, pdusu, vc, university, assembly, kg, pg, posting