విద్యార్థులకు సూచనలు.. ‘డిజి’ చానెళ్ల లిస్ట్..!

దిశ, వెబ్‌డెస్క్ :

తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులు సెప్టెంబర్ 1వ తేదీ( ఈరోజు) నుంచి మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాల ప్రిన్సిపాల్స్ నుంచి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు అందాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో డిజిటల్ క్లాసెస్ నిర్వహిస్తున్నందున విద్యార్థులు తమ ఇంట్లో ఉండే టీవీలు, స్మార్ట్‌ఫొన్స్‌ ద్వారా పాఠాలు వినవచ్చు. ఈ క్లాసులు టీశాట్, దూరదర్శన్, యాదాద్రి చానెల్స్ ద్వారా ప్రసారం కానున్నాయి. ఇవి : Sun direct 188, Tata sky 1499, Airtel 946, Dish tv 1627, Videocon 702, DD Yadagiri 18 T-Sat Nipina 133, T-SAT Vidya 134, Free dish 43, Hathaway 719 చానల్ నెంబర్ల ద్వారా మీకు కేటాయించిన సమయంలో తప్పకుండా పాఠాలను వినాలని పాఠశాలల నుంచి విద్యార్థులకు మెసెజ్‌‌లు వెళ్లాయి.

ఒకవేళ ఇంట్లో టీవీ లేని వారు సెల్ ఫోన్ ఉంటే యూట్యూబ్‌లోనికి వెళ్లి టీ సాట్ లైవ్ (T-SAT live) చూడాలని డీఈవోలు ఆయా జిల్లాల్లో ఆదేశాలు జారీ చేశారు. పాఠాల్లో చెప్పే ముఖ్యమైన పాయింట్లను నోట్‌బుక్ లో రాసుకోవాలని, తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధ్యాపకులకు ఫోన్ చేసిగానీ,  వాట్సాప్ గ్రూప్ ద్వారా అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. హోంవర్క్ ఇస్తే అదేరోజు పూర్తి చేయాలన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠాలు వింటున్నారా లేదా అనే విషయాన్ని ప్రిన్సిపాల్, అధ్యాపకులు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఆన్లైన్ పాఠాలకు హాజరైయ్యే విద్యార్థులు ఆ విషయాన్ని తరగతి వాట్సాప్ గ్రూపులో తెలియజేయాలని సూచించారు. ఎవరికైనా టీవీ, సెల్ ఫోన్ లేనిపోతే స్నేహితుల ఇంటికి వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి చూడాలన్నారు. ప్రతిరోజూ అదే సమయంలో మీ తరగతికి సంబంధించిన పాఠాలు ప్రసారమవుతాయని, జాగ్రత్తగా విని అధ్యాపకులు ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పాలని కోరారు. ఇంకాఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ లెక్చరర్ ను అడిగి నివృత్తి చేసుకోవాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు.

Advertisement