- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
23 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. భావోద్వేగాలతో ప్రసంగం

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఫంక్షన్ హాల్‌లో ఆదివారం లింగాల ZPHS (1997- 98) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు జాహంగీర్ నాయక్, బాలయ్య, నిరంజన్, లక్ష్మీ నర్సమ్మ హాజరయ్యారు. వీరిని.. పూల మాలలు, శాలువాలతో విద్యార్థులు ఘనంగా సత్కరించారు. 23 సంవత్సరాల తర్వాత వీరంతా కలిసిన సందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు.
అనంతరం విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ రంగాల్లో ఆరితేరిన తోటి విద్యార్థులు భావోద్వేగాలతో ప్రసంగించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధే తమ అభివృద్ధి అని తెలిపారు. మొత్తం 160 మంది విద్యార్థులకు గాను 150 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను తోటి విద్యార్థులు అభినందించారు.