పరీక్షలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా..?

by Shamantha N |   ( Updated:2020-07-11 12:17:42.0  )
పరీక్షలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా..?
X

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహణపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌‌ఆర్డీ) శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో రాయవద్దని అనుకునే విద్యార్థులకు తర్వాత రాసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని యూనివర్సిటీలకు హెచ్‌‌ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సూచనలు చేశారు. ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్‌లో రాయడానికి ఇష్టపడనివారికి తర్వాత రాసే అవకాశముంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. విద్యార్థుల అభీష్టం మేరకు యూనివర్సిటీలు ఈ పరీక్షలు సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైనా నిర్వహించవచ్చునని వివరించారు. విద్యార్థుల ఆరోగ్యంతోపాటు వారి విద్యా నైపుణ్యాలు, కెరీర్‌లు ముఖ్యమే, ఏ విద్యలోనైనా పరీక్షలు చాలా అవసరమని పేర్కొన్నారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ సెప్టెంబర్‌లో ఉంటాయని యూజీసీ గైడ్‌లైన్స్ విడుదల చేసిన తర్వాత చాలా రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed