- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి నడిరోడ్డుపై నిద్రించి.. విద్యార్థుల నిరసన
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వసతి గృహలను వెంటనే తెరువాలని విద్యార్థి సంఘాల నాయకులు నడిరోడ్డుపై నిద్రించి నిరసన తెలిపారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట టీవీయూవీ, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సోమవారం హాస్టల్‌లు తెరుస్తామని హామీ ఇచ్చి వెంటనే మూసి వేయడాన్ని ఆగ్రహించారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నేతలు లాల్ సింగ్, వేణురాజ్‌లు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమిస్టరు పరీక్షల షెడ్యూల్ విడుదల అయిందన్నారు. కానీ హాస్టల్‌లు తెరువకపోతే ఇతర ప్రాంతాల విద్యార్థులు చాలా నష్టపోతారని అన్నారు. సోమవారం జిల్లా అధికారులు, సంక్షేమ అధికారులు వసతీ గృహాలు తెరుస్తామని ప్రకటించి, మళ్లీ సాయంత్రం వాటిని మూసి వేసారని ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు వెంటనే హాస్టల్‌లను ఓపెన్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు.