- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టోక్స్ దెబ్బకు రిటైర్ అవుదామనుకున్నా: బ్రాడ్
దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. అంతేకాకుండా 500 వికెట్ల మైలు రాయిని దాటి రికార్డులకెక్కాడు. అయితే తొలి టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన స్టోక్స్, బ్రాడ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. వరుసగా 50కి పైగా టెస్టులు ఆడిన బ్రాడ్ జట్టులో స్థానం కోల్పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడంటా. ఆ ఐదు రోజులు బాధపడిన బ్రాడ్ టెస్టులకు గుడ్‌బై చెబుదామని కూడా అనుకున్నాడంటా. ఈ విషయాన్ని బ్రాడ్ స్వయంగా చెప్పాడు. ‘తొలి టెస్టులో స్థానం దక్కకపోవడంతో రిటైర్మెంట్ ఆలోచన మెదిలింది. స్టోక్స్ తన దగ్గరకు వచ్చి తుది జట్టులో స్థానం లేదని చెప్పినప్పుడు నా నోట మాట రాలేదు. శరీరమంతా ఒక్కసారిగా వణికింది. అయినా తుది జట్టులో ఉంటాననే నమ్మకం ఉంది. కానీ టాస్‌కు వెళ్లే ముందు లేననే విషయం ధ్రువీకరించుకున్నాను. ఆ వారమంతా తనకు భారంగా గడిచింది. బయోబబుల్ కాబట్టి నిద్ర లేవగానే క్రికెట్ గ్రౌండే కనిపించేది. చుట్టూ క్రికెటర్లే ఉండేవారు. క్రికెట్టే లైఫ్ కాబట్టి దానికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడ్డా’ అని చెప్పుకొచ్చాడు. అయితే తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పరాజయం తర్వాత బ్రాడ్ తిరిగి తుది జట్టులోకి వచ్చి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకోవడం విశేషం. తన ముందు ఉన్న లక్ష్యం 600 వికెట్లని బ్రాడ్ స్పష్టం చేశాడు.