- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాళ్లు నరికేస్తా.. రేవంత్‌కు జోగు రామన్న స్ట్రాంగ్ వార్నింగ్

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన ఒక దొంగ రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పగటి దొంగ రేవంత్ కు త్వరలోనే తగిన శాస్తి చేస్తామని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే కాళ్లు చేతులు నరికి పంపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం చేయాలనుకునే చేస్తుందని వెల్లడించారు. నివాస గిరిజనులకు త్వరలోనే హక్కు పత్రాలు అందజేస్తామని పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని 13444 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత, ఆదివాసీలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story