- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బెంగళూరులో కఠిన లాక్‌డౌన్
by Shamantha N |

X
బెంగళూరు: గత వారం రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న బెంగళూరులోని పలు ఏరియాల్లో కఠిన లాక్‌డౌన్ విధించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ)లో 198 వార్డుల్లో ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. బెంగళూరులో రాష్ట్ర ఉన్నతాధికారులతో సోమవారం సీఎం బీఎస్ యడ్యూరప్ప భేటీ అయ్యారు. ఈ సమీక్షలో బెంగళూరులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ఏరియాల్లో కఠినంగా లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని తీసుకున్నారు. గుర్తించిన ప్రాంతాల్లో 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్టు రెవెన్యూ మంత్రి ఆర్ అశోకా తెలిపారు.
Next Story