- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారికి ఏపీ సీఐడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అసత్య ప్రచారం, మార్ఫింగ్ ఫొటోలు పెడితే కఠినంగా శిక్షిస్తామని.. అలాగే డబ్బు ఇచ్చి ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిని సైతం వదిలిపెట్టమని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసి అశ్లీల పదజాలం చొప్పించి తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారంటూ.. ఏపీ సీఐడీ టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ ఎల్లపు సంతోష్‌రావును సీఐడీ సైబర్ క్రైమ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారు ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. మహిళలను, గౌరవప్రదమైన స్థానంలో వారిని కించపరిచేలా తప్పుడు సమాచారాన్ని, తప్పుడు భాషను వాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడితే చర్యలు తప్పవని సీఐడీ పేర్కొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు రేకెత్తించే, అశ్లీల, అబద్ధపు పోస్టులను పెట్టవద్దని సూచించింది.
సంతోష్, ఆయన భార్యకు ఏదైనా జరిగితే సీఐడీదే బాధ్యత..
టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్‌ను ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం పై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ‘సోషల్ మీడియా యాక్టివిస్ట్ యల్లపు సంతోష్.. నిండు గర్భిణి అయిన భార్యను ఆసుపత్రిలో డెలివరీ కోసం చేర్చగా.. ఉగ్రవాదుల్లా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘కనీసం నోటీసు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకుండా వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూసేందుకు సీఐడీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం. సంతోష్, ఆయన భార్యకి ఏమి జరిగినా పూర్తిగా సీఐడీదే బాధ్యత. కడుపుమండి సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టులా? పోస్టులు పెట్టే యాక్టివిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్టు చేయిస్తారా?’ అని నారా లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.