ఆ అవసరాలకు ఆక్సిజన్ విక్రయిస్తే కఠిన చర్యలు

by Shyam |
DSP Venkateswara rao
X

దిశ, మిర్యాలగూడ: పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు హెచ్చరించారు. గురువారం మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ సందర్శించి మాట్లాడారు. ప్లాంట్ నిర్వాహకులు కచ్చితంగా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, కేవలం ఆస్పత్రి అవసరాలకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించారు. పారిశ్రామిక అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో సిలిండర్లు విక్రయించరాదన్నారు. రవాణాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed