DGP: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : డీజీపీ మహేందర్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-05-22 07:40:42.0  )
DGP: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : డీజీపీ మహేందర్ రెడ్డి
X

దిశ, కాప్రా : లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలో లాక్ డౌన్ అమలును డీజీపీ పర్యవేక్షించారు. శనివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ, ఈసీఐఎల్ ప్రాంతాల్లో అకస్మీక తనిఖీలు నిర్వహించారు. లాక్‌డౌన్ ను మరింత కఠినంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఉదయం 10దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ రోడ్లపైకి రావద్దన్నారు. ఒకవేళ వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తిరిగి లాక్‌డౌన్ తర్వాత వాహనాలు వస్తాయని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చే వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.

గడువు ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చినా నిలిపివేస్తారని, గూడ్స్ వాహనాలు రాత్రి 9 నుంచి ఉదయం 8:00 వరకు రవాణా జరిగేలా చూసుకోవాలి సూచించారు. నిర్దేశించిన సమయంలోనే నిత్యావసర వస్తువుల కోసం సమీపంలోని మార్కెట్లనే ఆశ్రయంచాలన్నారు. రేపటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ రక్షితమూర్తి, ఏసీపీ శివకుమార్, కుషాయిగూడ సీఐ మన్మోహన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed