- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శశికళ ప్రకటన.. తెర వెనక ట్రబుల్ షూటర్..?
దిశ,వెబ్‌డెస్క్: ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను’ అన్న శశికళ సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేశం మొత్తం ఇప్పుడు తమిళ రాజకీయాల వైపు చూస్తున్నాయి. విడుదలైన వెంటనే కారుపై ఏఐడీఎంకే జెండాతో తిరుగుబాటు సంకేతాలు ఇచ్చిన నేత ఒక్క సారిగా ఎజెండా ఎందుకు మార్చింది. ఆమె సంచలన నిర్ణయం వెనక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి.. ఎవరి ఊహకూ అందని ఆ వ్యూహాలను ఎందుకు రచించాల్సి వచ్చింది. వివరాల కోసం రీడ్ దిస్ స్టోరీ..
ఈ ఏడాది ప్రారంభం నుంచి తమిళ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శశికళ. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ.. విడుదల తర్వాత తమిళ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతాయని అంతా ఊహించారు. ఆ వాదనలకు బలం చేకూర్చేలా విడుదల అవుతూనే కారుపై ఏఐడీఎంకే జెండా పెట్టుకుని స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఆమె విడుదలతో అన్నాడీఎంకే నేత గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
ఇక ఏఐడీఎంకేలో శశికళ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్ని్కల నేపథ్యంలో ఆమెతో పెట్టుకుంటే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆమెతో రాజీ వైఖరిని అవలంభించాలని పళనీస్వామిపై బీజేపీ పెద్దలు ఒత్తిడి తెచ్చారని వార్తలు వినిపించాయి. దీంతో త్వరలో ఏఐడీఎంకేలోకి శశికళ వెళతారని.. లేదంటే ఏఐడీఎంకేకు ఇబ్బందులు తప్పవని అంతా ఊహించారు.
కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని.. డీఎంకేను ఓడించేందకు అందరూ పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ పరిణామంతో అందరికి ఊహించని షాక్ తగిలింది. దీంతో ఆమె ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏమై ఉంటుందని ఇప్పుడు అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు.
కాగా ఆమె నిర్ణయం వెనక అపర చాణక్యుడు అమిత్ షా ఉన్నట్టు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరి అంచనాలకు అందకుండా ఓ అద్బుత మైన వ్యూహాన్ని ఆయన అమలు చేశారని అంటున్నారు. దానికి కొన్ని కారణాలను కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవడంపై పళనీస్వామి విముఖంగా ఉండటం ఒక కారణం. ఇక ఆమెపై అక్రమాస్తుల కేసు ఉండటం మరో కారణం..
ఒక వేళ పళనీ వర్గంతో కలిసి పోయి పనిచేస్తే.. ఆమె అవినీతిని ఆ పార్టీకి డీఎంకే నేతలు ఆపాదించే అవకాశం ఉంది. ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకు పోతుంది. అలాంటి తరుణంలో ఆమెను పార్టీలోకి చేర్చుకోక పోవడం బెటర్. ఇక మెజార్టీ నేతలు ఆమెకు అనుకూలంగా ఉండటం. పార్టీకి దూరంగా ఉంటూ ఇలానే కార్య కలాపాలు కొనసాగిస్తే క్యాడర్ తో పాటు ఓటు బ్యాంక్ కూడా చీలిపోయే ప్రమాదం కూడా ఉంది.
తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. అందుకోసం అధికార ఏఐడీఎంకేతో పొత్తు కుదుర్చుకున్నది. ఈ నేపథ్యంలో శశికళ ఎపిసోడ్ వారికి ఇబ్బంది కరంగా మారింది. ఇలాంటి తరుణంలో ట్రబుల్ షూటర్ అమిత్ షా ఎంటర్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా నయానో భయనో శశికళను దారికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏఐడీఎంకేలో ఆమె చేరకుండా.. పార్టీకి దూరం పెట్టారన్న సంకేతాలు వెళ్లకుండా ఉండేలా ఆమెతో ప్రకటన చేయించారని విశ్లేషకులు అంటున్నారు.