- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంజన్న సన్నిధిలో అద్భుత వైద్యుడు… భూత వైద్యుడి వింత చేష్టలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: మానసిక వికలాంగులకు ఆరాధ్యుడు కొండగట్టు అంజన్న. ఇక్కడ దశాబ్దాల కాలంగా చాలా మంది మానసిక వికలాంగులను వదిలేసి వెళ్తుంటారు. కొంతకాలం తరువాత వారి మానసిక స్థితి బాగవుతుందన్నది భక్తుల నమ్మకం. ఈ ఆచారం ఒక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే కాదు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆచారాలను పాటిస్తుంటారు. భక్తులకు అంత నమ్మకాన్ని కల్పించిన ఆయన సన్నిధిలోనే కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. భూత, ప్రేత పిశాచాలను వదిలిస్తాడట. చదవుతుంటే ఆశ్చర్యంగా ఉన్న అక్షరాల ఇది నిజం.
భూత వైద్యుడి వింత చేష్టలు…
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లే ఘాటు రోడ్డులో ఈ వింత వైద్యం చేస్తున్నారు. సాధారణంగా అంజన్నదర్శనం తరువాత కొంతమంది భక్తులు భేతాళునికి మొక్కులు తీర్చుకుని జంతువులను బలి ఇస్తారు. అనాదిగా సాగుతున్న ఆ భక్తుల నమ్మకమే వారికి పెట్టుబడిగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఓ ఆధునిక దేవుడు తన అనుచరులతో కలిసి ప్రత్యేక వాహనంలో వచ్చి ఘాటు రోడ్డులో సరికొత్త వైద్యం మొదలు పెట్టాడు. దెయ్యం, భూతం, ప్రేతం, పిశాచి పడితే వదిలిస్తానని చెప్తూ వింత చర్యలు, వికృత చేష్టలతో భక్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. విచిత్ర విన్యాసాలతో ఆ భూతవైద్యుడి కదలికలను, అరుపులను చూసిన భక్తులు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. అర్థంకాని అరుపులు అరుస్తూ పడుకున్న వ్యక్తి కడుపుపై నోరు పెట్టి పళ్లతో లాగుతూ విచిత్రంగా వ్యవహరించాడు. చివరకు కడుపులో పురుగులు ఉన్నాయని వాటిని తొలగించానని పో అంటూ ఆ బాధితున్ని వెల్లగొట్టాడు. ఇలా వికృత చేష్టలు చేస్తున్న ఈ కలియుగ భూతవైద్యున్ని అడ్డుకునే వారే లేకుండా పోయారు. కొండగట్టు ఘాటు రోడ్డులో ఇలాంటి చేష్టలేంటని వారిని వెల్లగొట్టే ప్రయత్నం కూడా చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది.
ఇద్దరు యువతులు…
ఈ భూత వైద్యుడితో పాటు మరో ఇద్దరు యువతులు కూడ ఉన్నారు. వారు ముందుగా పడుకున్న వ్యక్తి చుట్టు తిరుగుతూ అతని కడుపుపై తల పెట్టి ఎదో చేసినట్టుగా నటిస్తున్నారు. ఆ పక్కనే అప్పటి వరకు నిలబడి ఉన్న భూత వైద్యుడు అరుచుకుంటూ గిరాగిరా తిరుగుతూ, చేతులను వెనక్కి పెట్టి పడుకున్న వ్యక్తి కడుపుపై నోరు పెట్టి ఏదో లాగినట్టు చేస్తూ వెకిలిగా వ్యవహరించాడు.
ఆచారం అంటూ ప్రచారం…
పూర్వ కాలం నుంచే భక్తులు దేవునికి మొక్కులను ఎన్నో రకాలుగా తీర్చుకుంటారు. తలనీలాలు ఇచ్చే వారు కొందరైతే, ప్రత్యేక పూజలు చేసేవారు మరికొందరు. ఇలా వింత పద్దతిలో మొక్కులు తీర్చుకునే సాప్రదాయం ఏంటో అర్థం కావడం లేదని భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా అంజన్న సన్నిధికి వచ్చిన మహారాష్ట్ర భూత వైద్యుడి వింత చేష్టల గురించి మాత్రం భక్తులు చర్చించుకుంటున్నారు.