- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీకాకుళం కరోనా కేసుల్లో విచిత్రం.. కరోనా ఎలా వచ్చింది?
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో 3 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం పాతపట్నం పరిసరాల్లోనే కాకుండా ఆ జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇక్కడ కరోనా వైరస్ సోకిన విధానం వైద్య ఆరోగ్య శాఖాధికారులను విస్మయానికి గురిచేస్తోంది.
ఇంతకీ ఆ చిత్రమేంటంటే… శ్రీకాకుళం జిల్లా నుంచి లక్షల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తుంటారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వారంతా వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు చేరుకున్నారు. ఆంక్షలు విధించిన తరువాత కూడా పలువురు జిల్లాకు వచ్చారు. అలానే ఢిల్లీలోని మెట్రోల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి కూడా పాతపట్నం మండలంలోని సీది గ్రామానికి వచ్చారు.
అయితే ఆయనకు కానీ, ఆయన భార్య, వారి 8 నెలల కుమారుడిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. అయితే ఎలాంటి ట్రావెల్ రికార్డు లేని ఆయన మామ, అత్త, మరదలుకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆయన ద్వారానే వారికి సోకి ఉండాలని చెబుతున్నారు. కానీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. దీంతో వారు ఆశ్చర్యంలోనే ఉన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఉప్పు వ్యాపారి. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉప్పు విక్రయిస్తుంటాడు. దీంతో అధికారులకు ఏం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులతో సంబంధాలు నెరపిన వారిని, ఉప్పు అమ్మడం ద్వారా కలిసిన సుమారు 2,600 మంది అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. వారందరికీ పరీక్షలు నిర్వహించి, నిర్థారణ అయిన తరువాతే వారిని ఇళ్లకు పంపించనున్నారు.
Tags: srikakulam district, ap, pathapatnam, seedi village, corona positive, salt businessmen