ఇంట్రెస్టింగ్‌గా ‘స్టోరీ ఆఫ్ ఇన్ జస్టిస్’

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి లేడు.. తల్లి హాస్పిటల్‌లో పని చేసే ఆయా.. కానీ బిడ్డ అనిత మాత్రం టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్.. డాక్టర్ కావాలనేది తన డ్రీమ్. అందుకే నీట్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతుంటుంది. ఇందుకోసం మనీ కావాలి కాబట్టి, తను కూడా సాయంత్రం పూట ఓ ధనవంతుడి ఇంట్లో పని చేస్తుంటుంది. ఇక ఆ ఇంట్లో ఉండే రిచ్ కిడ్ మాత్రం తల్లిదండ్రులు లేని టైమ్ చూసి, బాయ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ, మత్తు పదార్థాలు తీసుకుని మత్తులో తూగుతుంటుంది. ఈ క్రమంలోనే ఇది పద్ధతి కాదని వారిస్తుంది అనిత. అప్పుడే ఆ రిచ్ కిడ్ తల్లి కాల్ చేస్తే, ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంతో తనపై పగ పెంచుకున్న ఆమె బాయ్ ఫ్రెండ్స్.. అనిత ఇంటికెళ్లే క్రమంలో హెల్మెట్లు ధరించి అడ్డగించి, తనపై అత్యాచారం చేస్తారు. తనపై అటాక్ చేసింది వాళ్లే అని అనితకు ఎలా తెలిసింది? నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తానని సవాల్ విసిరిన అనిత ఎలా చనిపోయింది? చనిపోయాక చుట్టుపక్కలవారు అనిత గురించి మీడియాకు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఆ టీనేజ్ గర్ల్‌కు న్యాయం జరుగుతుందా? లేక తన మరణంతోనే నిజం కూడా సమాధి అవుతుందా? అనేది ‘స్టోరీ ఆఫ్ ఇన్ జస్టిస్’ షార్ట్ ఫిల్మ్ కథ.

బిడ్డ రాత్రి పొద్దుపోయేదాకా చదువుకుని పడుకుని ఉంటుందని, తన గది తలుపు తట్టేందుకు కూడా ఆలోచించిన తల్లికి.. తెల్లారి చూసేసరికి కన్న కూతురు ఉరికొయ్యకు శవమై వేలాడుతుంటే ఎలా ఉంటుంది? ఆ తల్లి హృదయం ఎలా తట్టుకుంటుంది? అటు భర్త, ఇటు కూతురిని కోల్పోయిన తన పరిస్థితి ఏంటి? భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్న బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియని స్థితిలో ఉన్న తల్లికి న్యాయం ఎలా జరుగుతుంది?. చిన్న సినిమానే అయినా.. ఇంటెన్స్ సీన్స్, అమేజింగ్ యాక్టింగ్‌తో సూపర్‌గా తెరకెక్కించారు. మధ్య తరగతి జీవితాలు మధ్యలోనే బలైపోతున్నా.. న్యాయం ఎందుకు జరగడం లేదో చెప్పేందుకు ఈ షార్ట్ ఫిల్మ్ ఒక ఉదాహరణ కాగా, ఆడియన్స్ నుంచి అమేజింగ్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

Advertisement