ఆగిపోయిన ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీ

by Shiva |
ఆగిపోయిన ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీ
X

దిశ, స్పోర్ట్స్: జపాన్‌లో కోవిడ్ కేసులు పెరిగి పోతుండటంతో ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీని నిర్వాహక కమిటీ ఆపేసింది. ప్రస్తుతం హిరోషిమా వీధిల్లో ర్యాలీ జరుగుతుండగా.. కోవిడ్ భయందోళనల మధ్య ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మెగా ఈవెంట్‌కు మరో 10 వారాలే సమయం ఉన్న నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ ర్యాలీ ఆగిపోవడం పెద్ద ఎదురు దెబ్బే అనుకోవచ్చు. కాగా, ర్యాలీ లేకపోయినా వచ్చే వారం టార్చ్‌ను వేరే రాష్ట్రానికి అందించాల్సిన కార్యక్రమాన్ని మాత్రం నిర్వహిస్తామని హిరోషిమ గవర్నర్ హిదేకో యుజాకి తెలిపారు.

ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీ ప్రారంభమైన నాటి నుంచి పలు మార్లు వాయిదా పడుతూ.. దారులు మార్చుకుంటూ నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ నిర్వహించవద్దని జపాన్ ప్రభుత్వం, నిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీపై ఒత్తిడి పెరుగుతున్నది.

Advertisement

Next Story