ఫేక్ న్యూస్‎కు చెక్..!

దిశ వెబ్‎డెస్క్: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని తప్పుడు వార్తలు వైరల్ అవుతుంటాయి. దీంతో ఏది నిజమో, అబద్దమో తెలుసుకోవడం కష్టం అవుతోంది. అయితే ఫేక్ న్యూస్ వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఫేక్ న్యూస్‎ను అరికట్టేందుకు నగర పోలీసులు పిలుపునిచ్చారు. ఫార్వార్డెడ్ మేసేజ్‎లను మళ్లీ ఫార్వార్డ్ చేయొద్దని పోలీసులు సూచించారు. అసాంఘీక శక్తులు సృష్టించే తప్పుడు వార్తలను, వదంతుల గురించి 9490616555 నెంబర్‎కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement