- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాట్సాప్‌లో నయా వాల్‌పేపర్స్

దిశ, వెబ్‌డెస్క్ : యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్.. తాజాగా వాల్‌పేపర్స్‌లో మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసింది. దీంతో పాటు స్టిక్కర్స్ సెర్చింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. వాట్సాప్‌లో మనం తరచుగా వాల్‌పేపర్స్ మారుస్తుంటాం. కానీ అన్ని చాట్స్‌కు ఒకే వాల్ పేపర్ కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం వాట్సాప్ తెచ్చిన అప్‌డేట్‌తో ఒక్కో చాట్‌కు ఒక్కో వాల్‌పేపర్ పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ చాట్స్‌కు డిఫరెంట్ వాల్ పేపర్స్ ఉండటం వల్ల పొరపాటున ఇతరులకు మెసేజెస్ పంపే అవకాశం ఉండదు. న్యూ వాల్‌పేపర్స్‌ను యాడ్ చేయడంతో పాటు వాటిలో కొత్త కలర్స్‌ను కూడా తీసుకొచ్చింది. ఇది కాకుండా వాట్సాప్‌లో మన ఎమోషన్‌కు తగ్గ స్టిక్కర్ కావాలంటే వెతుక్కోవాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా, స్టిక్కర్లను సెర్చ్ చేసే ఫీచర్ తీసుకురావడంతో పాటు స్టిక్కర్స్ గ్యాలరీలో మరిన్ని స్టిక్కర్స్ యాడ్ చేసిన వాట్సాప్.. ఈ అప్‌డేట్‌ను ఐవోఎస్ యూజర్లకు మాత్రమే కల్పించడం గమనార్హం.