- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేవ్ ఇండియా డే సత్యాగ్రహానికి ఎస్టీఎఫ్ఐ మద్దతు
దిశ, న్యూస్బ్యూరో: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాప్తంగా జరగనున్న సేవ్ ఇండియా డే సత్యాగ్రహ ఉద్యమానికి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర విద్యామంత్రి ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యావిధానం రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ విధానాలతో విద్యారంగంలో అంతరాలను మరింత పెంచేదిగా ఉందని ఎస్టీఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య(ఎస్టీఎఫ్ఐ) కేంద్ర కార్యదర్శివర్గం ఆన్లైన్ సమావేశాన్ని గురువారం సమాఖ్య జాతీయ అధ్యక్షులు అభిజిత్ ముఖర్జీ అధ్యక్షతన నిర్వహించారు.
ప్రధాన కార్యదర్శి సీఎన్ భార్తి మాట్లాడుతూ కరోనా సాకుతో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో సంఘ పరివార్ ఎజెండాను అమలు జరిపే ప్రయత్నం చేస్తుందన్నారు. పార్లమెంటులో చర్చకూడా లేకుండా హడావుడిగా ఎన్ఈపీని హడావుడిగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్త సత్యాగ్రహ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 12న ఎస్టీఎఫ్ఐ 20వవార్షికోత్సవం సందర్భంగా ప్రజానుకూల జాతీయ విద్యావిధానం కావాలనే నినాదంతో జిల్లా, డివిజన్ కేంద్రాల్లో క్యాంపయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు ఎం. సంయుక్త, చావ రవి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ సాబ్జీ, పి.బాబురెడ్డి, అరుణ కుమారితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.