- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ ప్రజలకు శుభవార్త.. త్వరలో..
దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భూ స్వభావ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయ ఏర్పాటు కోసం 1140 ఎకరాల స్థలం కావాలని ఎయిర్ పోర్ట్ అధికారులు అడిగినట్లు చెప్పారు. 700 ఎకరాల స్థలం ఉండగా మరో 200 ఎకరాల స్థలం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.