- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిసారి బయట అడుగుపెడుతున్నారా?.. ఇవి పాటించండి!
నాలుగో ఫేజ్ లాక్‌డౌన్ సడలింపులతో ఒక్కొక్కరుగా బయట అడుగుపెడుతున్నారు. కానీ ప్రతి అడుగులోనూ ఏదో తెలియని భయం, రెండు నెలల తర్వాత స్నేహితులను కలిసినప్పటికీ కౌగిలించుకుని భావోద్వేగాన్ని పంచుకోలేని తరుణం.. ఆఫీసుకెళ్లి పనిచేస్తున్నా ఎవరు ఏ వైపు నుంచి వచ్చి ముట్టుకుంటారేమోననే ఆందోళన.. రోడ్డు మీద నడుస్తున్నపుడు ఎవరన్నా తుమ్మినా దగ్గినా పెరిగే గుండె వేగం.. వీటన్నిటినీ తట్టుకునే ధైర్యం ఉన్నపుడే బయట అడుగుపెట్టాల్సి వస్తోంది. అందుకే బయట అడుగుపెట్టడానికి ముందు మానసికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది!
ఈ ఆందోళనలు భయాలను వైద్యులు పోస్ట్-లాక్‌డౌన్ యాంగ్జైటీగా పరిగణిస్తున్నారు. సాధారణ జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును తట్టుకోవడానికి మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఈ ఆందోళనకు సరైన కారణం తెలియదు కానీ ఆందోళన మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టి జనాల్లో కలవాలంటే ఈ భయాన్ని పోగొట్టుకొని తీరాలి. అయితే ఇలాంటి బాధ నుంచి ఎలా బయటపడాలి?
అంగీకరించడం నేర్చుకోండి..
రియాలిటీని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి. భవిష్యత్తులో కరోనా వైరస్‌తో జీవించక తప్పదని తెలుసుకుంటే ఈ ఆందోళన నుంచి బయటపడొచ్చని సైకియాట్రిస్ట్ డాక్టర్ సందీప్ వోహ్రా అంటున్నారు. పరిస్థితిని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఆనందంగా జీవితాన్ని సాగించవచ్చు లేదంటే దుర్భరంగా మారుతుంది.
జాగ్రత్తలు తీసుకోండి..
మన ఆందోళనకు ప్రధాన కారణం, వైరస్ మనకు అంటుందేమోనని. మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఈ ఆందోళన అలాగే ఉంటుంది. దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు చెబుతున్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఆందోళన మొత్తాన్ని ఈ జాగ్రత్తలు తీసుకునే వైపునకు మళ్లిస్తే సరిపోతుందని మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సమీర్ పారిఖ్ సలహా ఇస్తున్నారు. పనికి వెళ్లినపుడు మాస్కులు ధరించి, శానిటేషన్ సరిగా పాటించడంతో పాటు సామాజిక దూరం మెయింటైన్ చేయాలని ఆయన చెబుతున్నారు.
మీ సహోద్యోగులతో మాట్లాడండి..
రెండు నెలల తర్వాత కలిసినప్పటికీ ఒకప్పుడు ఉన్నంత క్లోజ్‌నెస్ ఇప్పుడు ఉండకపోవచ్చు. అందుకే కొవిడ్-19 కట్టడి కోసం కంపెనీ తీసుకుంటున్న చర్యలను సహోద్యోగులతో చర్చించండి. వీలైనంత మేరకు వాటిని పాటించడానికి సహకరించండి. పాటించని సహోద్యోగులు ఎవరైనా ఉంటే వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాన్ని వినియోగించండి.
కరోనా గురించి చర్చించడం మానుకోండి..
గంటల తరబడి మాట్లాడుకోవడానికి కరోనా అంత ట్రెండింగ్ టాపిక్ కాదు. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి చర్చించుకోకుండా ఉండటమే మంచిది. ఎక్కడైనా పాజిటివ్ కేసు గురించి తెలిస్తే ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాతే మిగతావారికి చెప్పండి. అంతేగానీ, ఆందోళనకు గురై తప్పుడు సమాచారాన్ని చేరవేయకండి.