శ్రీకాంతా చారి విగ్రహం ఆవిష్కరణ

by Shyam |
శ్రీకాంతా చారి విగ్రహం ఆవిష్కరణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆవిష్కరించారు. అఖిల భారతీయ విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జంక్షన్‌లో శ్రీకాంతా చారి విగ్రహం ఏర్పాటు చేశారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శిలాఫలకం, ఆచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమం గమ్యం, దిశను శ్రీకాంతాచారి బలిదానం మార్చివేసింది అని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, శ్రీకాంతా చారి తల్లిదండ్రులు శంకరమ్మ, మోహన చారిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story