అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు

by Shyam |
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
X

దిశ, గజ్వేల్: సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆదివారం ఆవిష్కరించారు. అంతకు ముందు రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రమం ప్రతిష్టించుకోవడం గొప్పవిషయం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story