ప్రైవేటీకరణ బ్యాంకుల ఉద్యోగులకు వీఆర్ఎస్ అవకాశం

by Harish |
ప్రైవేటీకరణ బ్యాంకుల ఉద్యోగులకు వీఆర్ఎస్ అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రైవేటీకరణకు ఎంపిక చేసిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు వీఆర్ఎస్ సదుపాయం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటీకరణకు ముందే మెరుగైన ప్యాకేజీతో రిటర్మెంట్ కావాలనుకునే ఉద్యోగుల కోసం సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్(ఐవోసీ) బ్యాంకులు వీఆర్ఎస్ వెసులుబాటు ఇచ్చేందుకు అవసరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, వీఆర్ఎస్ పథకం ఉద్యోగులను బలవంతంగా తప్పించడానికి కాదని, ప్రైవేటీకరణకు ముందు మెరుగైన ప్యాకేజీ కోరుకునే వారికోసం అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. గతంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ జరగడానికి ముందు వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఒక బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ కోసం బ్యాంకుల ఎంపిక బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పజెప్పింది. తాజాగా నీతి ఆయోగ్ సెంట్రల్ బ్యాంక్, ఐఓబీల ప్రైవేటీకణకు సిఫార్సు చేసింది. ఈ క్రమంలో నీతి ఆయోగ్ సిఫార్సును పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్), ఆర్థిక సేవల విభాగాలు పరిశీలించి చట్టపరమైన మార్పులను ప్రతిపాదిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియపై ఆధారపడి మిగిలిన నిర్ణయాలు అమలవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed