- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ సమయంలో.. ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా.. ఎన్నిసార్లైనా.. డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం, అంతేకాదు.. అసలే డబ్బులు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి అని.. మినిమం బ్యాలెన్స్ నిబంధనలు కూడా ఎత్తేసింది. వాటికి అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్. అయితే, లాక్‌డౌన్ ముగిసింది, అన్‌లాక్ ప్రారంభమైంది.. అన్‌లాక్ 1.0 ముగిసి.. ఇవాళ్టి నుంచి అన్‌లాక్ 2.0లో అడుగుపెట్టాం.. ఇదే సమయంలో.. బ్యాంకులు మళ్లీ ఛార్జీలు వడ్డిస్తున్నాయి. ఏటీఎం చార్జీలు, మినిమం బ్యాలెన్స్‌లకు సంబంధించి పలు రాయితీలను అప్పట్లో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించగా.. ఆ గడువు ముగిసిపోవడంతో.. ఇవాళ్టి నుంచి పాత పద్ధతిలో చార్జీలు ఉండబోతున్నాయి.. ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్లకు దీనికి సంబంధించి మెసేజ్‌లతో అలర్ట్ చేశాయి.
ఇక, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా కొత్త నిబంధనలు వెల్లడించింది. వాటి ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం నుంచి నెలకు 8 విత్‌డ్రాయిల్స్ మాత్రమే ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది.. వీటిలో ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఐదు, ఇతర బ్యాంకుల నుంచి మూడు విత్ డ్రాయిల్స్‌ను మాత్రమే ఉచితంగా పొందవచ్చు.. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. విత్‌డ్రాయిల్స్ సంఖ్య 10గా ఉంది. ఇందులో ఐదు ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి, మిగతా ఐదు ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి చేసుకోవచ్చు. ఈ పరిమితి మించితే మాత్రం ఛార్జీలు వడ్డింపు తప్పదు. ఆపై లావాదేవీలకు రూ.20 తోపాటు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. క్యాష్ విత్‌డ్రా కాకుండా.. ఇతర సేవలు… అంటే.. బ్యాలెన్స్ చెక్ చేయడం, పిన్ మార్చుకోవడం.. వంటి సేవలకు అయితే.. రూ.8తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేయనున్నారు. అంతేకాదు.. మళ్లీ తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సిందే.. ఎందుకంటే పాత నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా ఈ చార్జీలు వేస్తోంది. మొత్తంగా సరైన బ్యాలెన్స్ ఖాతాల్లో లేకపోతే.. బ్యాంకులను బట్టి.. రూ. 600 ప్లస్ జీఎస్టీ నుంచి.. రూ.150 ప్లస్ జీఎస్టీ వరకు వసూలు చేయనున్నారు. కావున.. ఇది గమనించకపోతే బ్యాంకు ఖాతాదారుల జేబుకు చిల్లు పడడం ఖాయం అన్నమాట.