ఇండియాతో మ్యాచ్‌లు లేవు.. మీ కాంట్రాక్ట్ మాకొద్దు

by  |
ఇండియాతో మ్యాచ్‌లు లేవు.. మీ కాంట్రాక్ట్ మాకొద్దు
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ బోర్డుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతున్నది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏ బ్రాడ్‌కాస్టర్ కూడా ప్రసార హక్కులను కొనడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ముందుకు వచ్చినా అతి తక్కువ ధరలకే హక్కులను అడుగుతున్నాయి. వీటికితోడు ఇప్పుడు ఇండియాతో మ్యాచ్‌లు లేకపోతే సబ్‌కాంటినెంట్ పరిధిలో హక్కులు అసలు వద్దే వద్దంటున్నారు. 2017 నుంచి న్యూజిలాండ్ క్రికెట్‌కు ఇండియాలో ప్రసారకర్తగా ఉన్న స్టార్ స్పోర్ట్స్ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కొనసాగించలేమని అంటున్నది. ఇందుకు స్టార్ చెప్పిన కారణం విని కివీస్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యపోయింది. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. తిరిగి భారత జట్టు 2022లో మూడు టీ20ల కోసం న్యూజిలాండ్ వెళ్లనుంది. ఈ లోపు ఎలాంటి పర్యటనలు లేవు. దీంతో రాబోయే రెండేళ్లు భారత్‌తో మ్యాచ్‌లే లేనప్పుడు మాకు ఈ హక్కులు వద్దని స్టార్ తెగేసి చెప్పింది. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్‌కు ఇండియాలో మ్యాచ్‌లు ప్రసారం చేసే వాళ్లే లేకుండా పోయారు. దీంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, విండీస్, శ్రీలంక క్రికెట్ బోర్డులు బ్రాడ్‌కాస్టర్లను వెతకడానికి కష్టాలు పడుతున్నాయి.


Next Story

Most Viewed