- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రీడల్లేక.. నష్టాల బాటలో స్టార్ నెట్‌వర్క్
కరోనా వైరస్ ప్రభావంతో క్రీడా రంగం భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎటువంటి క్రీడా టోర్నీలు లేకపోవడంతో బ్రాడ్‌కాస్టర్లకు కూడా తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఇండియాలో క్రీడా ప్రసారాలకు గుత్తాధిపత్యం వహిస్తోన్న స్టార్ ఇండియా నెట్‌వర్క్ ఇప్పుడు భారీగా నష్టపోనుంది. స్టార్ నెట్‌వర్క్‌లో స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ మూవీస్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ ఉన్నా.. స్టార్ స్పోర్ట్స్ ద్వారానే ఆదాయం ఎక్కువగా వస్తుంటుంది. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను సైతం స్టార్ నెట్‌వర్క్ రూ.16,347 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆసియా దేశాల్లో ఐసీసీ ఈవెంట్లను ప్రసారం చేసేది స్టార్ గ్రూప్ మాత్రమే. దీంతో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ బోర్డులతోనూ స్టార్‌కు ఒప్పందం ఉంది. కాగా, స్టార్ గ్రూప్ వ్యయాలు అంతకు ముందు ఏడాది రూ.8,694 కోట్లు ఉండగా.. గతేడాది అవి రూ. 13,707 కోట్లకు పెరిగిపోయాయి. దీంతో స్టార్ గ్రూప్ తొలిసారిగా రూ. 1,216 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
అయితే స్టార్, డిస్నీ ఇండియా నుంచి వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా బయటకు వచ్చేశాకే ఈ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ కబడ్డీ, ఫుట్‌బాల్, బోట్ రేస్ వంటి టోర్నీలను సొంత వ్యయంతో నిర్వహిస్తుండగా.. క్రమంగా వీటి రాబడి తగ్గిపోయింది. ఈ ఏడాది జనవరి తర్వాత స్వదేశంలో పలు క్రీడా టోర్నీలతో పాటు ఐపీఎల్ రద్దు కావడం స్టార్ స్పోర్ట్స్‌కు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇండియాలో ఎన్ని ఆటలు ప్రత్యక్ష ప్రసారం చేసినా క్రికెట్ మీద వచ్చే ఆదాయం కంటే మిగతా క్రీడల ఆదాయం తక్కువే. అందుకే క్రికెట్‌కు సంబంధించి శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ గ్రూప్ కొనేసింది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా పాత మ్యాచుల వీడియోలను ప్రసారం చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. నెల రోజులుగా స్టార్ గ్రూప్ టీఆర్పీలు కూడా ఘోరంగా పడిపోయాయి. ఈ సమయంలో మళ్లీ లైవ్ క్రీడలు ప్రారంభం అయితే గానీ, స్టార్ ఇండియాకు మంచి రోజులు రావని.. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగితే స్టార్ గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టకోక తప్పదని అంటున్నారు.
Tags : Star sports, Broadcasters, BCCI, Star Group, Satellite