చిన్న హీరోలకు స్టార్ హీరోస్ సాయం

by Jakkula Samataha |
చిన్న హీరోలకు స్టార్ హీరోస్ సాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. క్రియేటివిటీ ఉన్న ప్రతిభవంతులు అన్ని రంగాల్లో ఉన్నారు. కానీ వాళ్లు సక్సెస్ సాధించినా అంతగా వెలుగులోకి రావడం కష్టం. అలాంటి వారికి ఆ రంగంలో ఉన్నత స్థానంలో ఉండి ప్రోత్సహించే వాళ్లు ఉంటేనే గుర్తింపు లభిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో అదే జరుగుతోంది. టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న యువ హీరోల చిత్రాలను ప్రమోట్ చేయడానికి అగ్ర హీరోలు ముందుకు వస్తున్నారు. గతంలో అప్ కమింగ్ హీరోలకు ఇలాంటి సపోర్ట్ లేక ఎంతో మంది టాలెంట్ ఉన్నా.. వెండితెరపై వెలగలేక పోయారు. నేటి స్టార్ హీరోలు తమకు చేతనైనంత సాయం చేస్తూ.. ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు

ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం పెద్ద విషయం కాదు. కానీ తనేంటో ప్రూవ్ చేస్కోడానికి ఒక ఫ్లాట్ ఫామ్ దొరకాలి. లైమ్ లైట్లోకి రావాలంటే సపోర్ట్ కావాలి. అలాంటి సాయమే చేస్తున్నారు మన స్టార్ హీరోలు. అంతకుముందుచిన్న హీరోలని పట్టించుకోని ఇండస్ట్రీ ఇప్పుడు వాళ్లనికూడా ఎంకరేజ్ చేస్తోంది. అలా చిరంజీవి.. ఆది కి సాయం చేశారు. శశి మూవీ టీజర్ ని లాంచ్ చేసి తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు మెగాస్టార్ .

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అంతగా సక్సెస్ లేని హీరోని సపోర్ట్ చెయ్యడానికి ముందుకొచ్చారు. పెద్దగా హిట్ రికార్డ్ లేని అక్కినేని హీరో సుశాంత్ మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి .. సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానిక తనవంతు హెల్ప్ చేశారు.

ఎప్పుడూ పెద్దగా కనిపించని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మహర్షి సినిమాలో తన ఫ్రెండ్ గా చేసిన నరేష్ మూవీ నాంది ట్రైలర్ ని రిలీజ్ చేసి తనవంతు సాయం చేశారు మహేష్. లేటెస్ట్ గా శర్వానంద్ మూవీ శ్రీకారం టీజర్ ని కూడా రిలీజ్ చేసి చిన్న సినిమాల్ని లిఫ్ట్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ లో డైరెక్టర్ , హీరో, హీరోయిన్ ఇలా అందరూ కొత్తవాళ్లతో వస్తున్న సినిమా ఉప్పెన ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమా మీద హైప్స్ పెంచేశారు . మరో పక్క క్లాసికల్ డ్యాన్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న నాట్యం సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేసి కొత్త కంటెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు.

సీనియర్ హీరో వెంకటేష్ కూడా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అనసూయ లీడ్ రోల్ లో వస్తున్న థాంక్యూ బ్రదర్ సినిమాతో పాటు , శ్రీకాంత్ , సునీల్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఇంట్రస్టింగ్ కంటెంట్ ని ఆడియన్స్ లోకి తీసుకెళుతూ , చిన్న సినిమాలకు సాయం చేశారు .

Advertisement

Next Story