- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఎల్ తొలివారంలో వీళ్లు అందుబాటులో ఉండరు
దిశ, స్పోర్ట్స్: వచ్చే నెల 19నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలివారం పలువురు స్టార్ క్రికెటర్లు (Star cricketers) అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన (Australia tour of England) సెప్టెంబర్ 13న ముగియనుంది.
అలాగే, కరేబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League) ఫైనల్స్ సెప్టెంబర్ 10న జరగనుంది. దీంతో ఆయా సిరీస్/లీగ్‌లో పాల్గొని ఐపీఎల్‌కు (IPL) రావల్సిన క్రికెటర్లకు క్వారంటైన్ నిబంధన అడ్డంకిగా మారింది. ఐపీఎల్ (IPL) కోసం సృష్టిస్తున్న బయోబబుల్ (Bio Bubble) వాతావరణంలోకి ప్రవేశించాలంటే 7రోజులు ఐసోలేషన్ (Isolation)లో ఉండాలి.
అంతేకాకుండా రెండు సార్లు కొవిడ్ పరీక్ష(Kovid test)ల్లో నెగెటివ్ రావాలి. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఐపీఎల్ సీజన్ 13(IPL Season 13)లో మొదటి వారం గడిచిపోతుంది. దీంతో వీళ్లెవరూ తొలివారం వాళ్ల జట్లతో కలిసే అవకాశం లేదు. దాదాపు 17మంది స్టార్ క్రికెటర్లు (Star cricketers) కొవిడ్ నిబంధనల (Kovid rules) కారణంగా తొలివారం ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తున్నది.
వీరే ఆ క్రికెటర్లు:
చెన్నై సూపర్ కింగ్స్(CSK): సామ్ కర్రన్, జోష్ హాజెల్‌వుడ్, షేన్ వాట్సన్
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital) : అలెక్స్ కేరీ, జాసన్ రాయ్, స్టాయ్‌నిష్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): పాట్ కమ్మిన్స్, గ్రీన్, గుర్నీ, ఇయాన్ మోర్గాన్, టి. బాంటన్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab): సి.జోర్డాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH): బారిస్ట్రో, మిచెల్ మార్ష్, స్టాన్ లేక్, డేవిడ్ వార్నర్
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royels) : జోఫ్రా ఆర్చర్, టి. కర్రన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) : మొయిన్ అలీ, ఆరోన్ ఫించ్, ఫిలిప్, రిచర్డ్‌సన్
ముంబై ఇండియన్స్ (MI): కౌల్టర్ నిల్, క్రిస్ లిన్