ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2021 విడుదల

by Harish |
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2021 విడుదల
X

కేంద్ర మంత్రిత్వ కార్యాలయాలు/ శాఖలు/ సంస్థల్లో చేరాలనుకునే డిగ్రీ విద్యార్థులకు సదవకాశం. గ్రూప్-బి, గ్రూప్-సి క్యాటగిరీల్లో ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయెట్ లెవల్ (సీజీఎల్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రముఖ సంస్థల్లో అత్యున్నతస్థాయికి ఎదగడానికి ఇదో మంచి అవకాశం. భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను ఎస్‌ఎస్‌సీ వెల్లడించలేదు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగు స్థాయిల్లో ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పోస్టుల ఎంపిక విధానం, అర్హతలు తదితరాలపై సంక్షిప్తంగా…
నోటిఫికేషన్
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2021 నోటిఫికేషన్‌ను డిసెంబర్‌ 29న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే (డిసెంబర్ 29) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. చివరి తేదీ 2021, జనవరి 31.

వయో పరిమితి

ఆయా పోస్టులను అనుసరించి 18ఏండ్ల నుంచి 32మధ్య వయస్సు వారు అర్హులు.

పరీక్ష తేదీ

2020-21వ సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్‌, సవరించిన షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ముద్రించింది. ఎస్‌ఎస్‌ సీజీఎల్ 2021 టైర్-1 పరీక్షను మే 29 నుంచి జూన్ 7, 2021 మధ్య తేదీల్లో నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2021 టైర్-2(సీబీఈ), టైర్-3( రాత పరీక్ష) తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-202కు సంబంధించి ముఖ్యమైన తేదీల వివరాలను కింద ఇవ్వడం జరిగింది.

ఎస్ఎస్‌సీ సీజీఎల్ 2021 పరీక్ష తేదీలు

నోటిఫికేషన్ విడుదల తేదీ: 29, డిసెంబర్, 2020
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ: 29, డిసెంబర్ – 31, జనవరి 2021
టైర్-1 అడ్మిట్ కార్డులు: మే, 2021
టైర్-1 పరీక్ష తేదీ: మే 29, 2021
టైర్-1 ఫలితాలు: జూలై, 2021
టైర్-2, టైర్-3, టైర్-4 పరీక్షల తేదీలను త్వరలో విడుదల చేయనున్నారు.
ఎస్ఎస్‌సీ సీజీఎల్ -2021కు సంబంధించి పోస్టుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. గత ఏడాది మొత్తం 8,581 పోస్టులను భర్తీ చేయగా, అందులో జనరల్ క్యాటగిరీల్లో 3674 పోస్టులను భర్తీ చేశారు. అయితే, గత కొన్నేండ్లుగా పోస్టుల సంఖ్య తగ్గతూ వస్తున్నది. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2018-19 ద్వారా 11,721 పోస్టులను భర్తీ చేశారు. ఆదాయపు పన్నుశాఖ, కస్టమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టులను భర్తీ చేశారు. గత మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసిన పోస్టుల ఆధారంగా ఈసారి ఎన్ని పోస్టులు ఉంటాయో అంచనాకు రావచ్చు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ -2021 ఖాళీలు—

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ -2019-20 ఖాళీలు జనరల్ -3674 ఎస్సీ-1242 ఎస్టీ-667 ఓబీసీ-2198 మొత్తం-8,252
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ -2018-19 ఖాళీలు జనరల్ -5770 ఎస్సీ-1723 ఎస్టీ-845 ఓబీసీ-2933 మొత్తం-11,271
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ -2017 ఖాళీలు జనరల్ -4238 ఎస్సీ-1318 ఎస్టీ-653 ఓబీసీ-1916 మొత్తం-9,276
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఎంపిక ప్రక్రియ
నాలుగు స్థాయి(టైర్‌)ల్లో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
టైర్-1 ఆన్‌లైన్
టైర్-2 ఆన్‌లైన్
టైర్-3 రాత పరీక్ష ఆఫ్‌లైన్
టైర్-4 కంప్యూటర్ ప్రొపెన్సీ టెస్ట్
టైర్-1లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లీస్ట్ చేసి టైర్-2, ఆ తర్వాత టైర్-3కి అవకాశం కల్పిస్తారు.

Advertisement

Next Story

Most Viewed