- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నుల పండువగా శ్రీతాటమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు
దిశ, ఏపీ బ్యూరో: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, గోదావరి జిల్లాల కొంగుబంగారం శ్రీ తాటమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం బోడపాటి వారిపాలెంలో శ్రీతాటమ్మ తల్లి అమ్మవారి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ తాటమ్మ అమ్మవారు మరియు పోతురాజు వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి ఆలయంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి ముత్తైదువులు జలాభిషేకం, తర్వాత కుంకుమ పూజ చేశారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞాలు, హోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలను అమ్మలగన్న అమ్మ శ్రీతాటమ్మతల్లి కరుణించి కాపాడాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నల్లా దుర్గానరసింహరావు, బోడపాటి తాతాజీ, బండి నాగబాబు, యడ్లపల్లి ధర్మరాజు, పడాల సూరిబాబు, పోలిశెట్టి గణపతి మరియు గ్రామ పురజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు.
- Tags
- celebrations