- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ వీడ్కోలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ వీడ్కోలు చెప్పారు. ప్రస్తుతం సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా శ్రీరాం వెంకటరమణను నియమించినట్టు ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త నియామకం తక్షణమే అమలులోకి రానున్నట్టు స్పష్టం చేసింది.
2018, సెప్టెంబర్ నుంచి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఎఫ్‌వోగా కొనసాగుతున్న ఎమిలీ మెక్‌నీల్ పదవికి రాజీనామా చేశారు. వాల్‌మార్ట్ గ్రూప్ దాటి మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వెళ్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్, మింత్రాకు సీఎఫ్‌వోగా ఉన్న శ్రీరాం.. పన్ను, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రెజరీతో పాటు, కీలకమైన ఫైనాన్స్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించి కార్పొరేట్ అభివృద్ధి కోసం శ్రీరాం బాధ్యత తీసుకుంటారని, ప్లానింగ్ అండ్ ఎనలిటిక్స్, ప్రొక్యూర్‌మెంట్, డెసిషన్ సైన్సెస్ హెడ్‌లు ఆయనకు రిపోర్ట్ చేస్తారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో పలు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన శ్రీరాం ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్‌వోగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. హైపర్ లోకల్ ఫ్రెష్ ఫుడ్ సామర్థ్యాలను పెంపొందించే కీలక పెట్టుబడుల అంశంలో మెక్‌నీల్ ప్రధానపాత్ర పోషించారని, బలమైన భాగస్వామిగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కళ్యాణ్ కృష్ణమూరి తెలిపారు.
Tags: Flipkart, India, Sriram Venkataraman, Walmart