- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాంసాగర్ 35 గేట్లు ఎత్తివేత
by Aamani |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అది బుధవారం సాయంత్రానికి 4,32,325 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో, 1091 అడుగులతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 89.763 టీఎంసీలకు చేరింది.
ఈ క్రమంలో అధికారులు గురువారం మొదట 8 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. గేట్లు ఎత్తిన విషయం తెలియడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు.
Advertisement
Next Story