- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెదిరించి పన్నులు వసూలు చేయడం ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఏపీకే సాధ్యం..

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఓటీఎస్ విధానంపై స్పందించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తుందని, ఓటీఎస్ కట్టకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామంటూ ప్రజలను బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను బెదిరించి పన్నులు వసూలు చేసే ప్రభుత్వ విధానం ఆఫ్ఘనిస్తాన్‌కు, ఆంధ్రాకు మాత్రమే చెందిందన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వ పాలన ఉందంటూ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
Next Story