- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ పథకంతోనే మహబూబ్‌నగర్ సస్యశ్యామలం’
by Shyam |
X
దిశ, మహాబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమాను అందిస్తున్నామని గుర్తు చేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను వేసి లాభాలను ఆర్జించాలనే లక్ష్యంగా నియంత్రిత సాగు పద్ధతి తీసుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ వనజా అంజనేయులు గౌడ్, కలెక్టర్ హరి చందన తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story