- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అధికారులకు స్థాన చలనం తప్పదు: శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులను అకారణంగా వేధించే అధికారులకు స్థాన చలనం తప్పదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ గ్రూప్ – 1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్ర భారతిలో 2021 సంవత్సరం డైరీ,క్యాలెండర్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమానికి డైరీలు ఊత మిచ్చాయన్నారు.
నూతన సంవత్సరంలో సుమారు మూడు నెలల పాటు వీటి ఆవిష్కరణలు జరిగేవని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో రాష్ట్రం ఎలా సాధించుకోవాలనే అంశాలపై వక్తలు మాట్లాడేవారని, ఎంతో విలువైన సమాచారం డైరీలలో పొందుపర్చేవారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఉద్యోగుల పీఆర్సీ వంటి సమస్యలు కూడా వీలైనంత త్వరలోపరిష్కారమవుతాయని అన్నారు. ఉద్యోగుల పదోన్నతులు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయని ఆయన చెప్పారు.