శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది

by Shyam |   ( Updated:2020-12-03 09:09:06.0  )
శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది
X

దిశ,తుంగతుర్తి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని మంత్రులు జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడులో నిర్వహించిన శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సభకు వారు గురువారం హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…శ్రీకాంతాచారి త్యాగం వల్లనే స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రం కోసం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారనీ… ఆయన త్యాగం చరిత్రలో మరువలేనిదని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

Advertisement

Next Story