- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఆర్ఆర్‌పై మంత్రి ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సహచర ఎమ్మెల్యేలపై ఎంపీ రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదులు చేయగా, ఇప్పుడు ఎమ్మెల్యే వంతు వచ్చింది. తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తనపై అసత్య ఆరోపణలతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో సంపాదించుకున్న పేరును చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గంలోని పోడూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో తనతో పాటు తన కుమారుడ్ని దొంగలుగా సంబోధించడం, పేర్ని నానితో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌నుద్దేశించి పందులే గుంపులుగా వస్తాయడం, మీడియా లైవ్ డిస్కషన్స్‌తో పాటు సోషల్ మీడియా వేదికలపై తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని, రఘురామకృష్ణం రాజుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.