- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో ‘లిమ్కా’.. శ్రీకర్ చమ్కా
సినిమా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఒక్కసారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ అరుదైన అవకాశాన్ని మరోసారి దక్కించుకున్నారు. అధిక భాషల్లో సినిమా ఎడిటింగ్ చేసిన వ్యక్తిగా శ్రీకర్ ప్రసాద్ గుర్తించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలిపింది. 2019కి గాను ఈ గుర్తింపును ఇచ్చింది. గతంలో 2013లో పీపుల్ ఆఫ్ ది ఇయర్‌గా శ్రీకర్‌ప్రసాద్ పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసింది. 1983లో సినీ కెరియర్‌ను ప్రారంభించిన ఆయన 180 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఎనిమిది జాతీయ అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతోపాటు మరెన్నో సత్కారాలు పొందారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రెండోసారి చోటు దక్కడంపై శ్రీకర్ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘వైవిధ్యమైన మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నా భావోద్వేగం మాత్రం ఒక్కటే. అందుకే ఈ రికార్డు భారతీయులందరికి అంకితం’ అంటూ పోస్ట్ పెట్టాడు.