భారత్‌లో వచ్చేవారం స్పుత్నిక్ వీ ట్రయల్స్

by Anukaran |
భారత్‌లో వచ్చేవారం స్పుత్నిక్ వీ ట్రయల్స్
X

న్యూఢిల్లీ: రెగ్యులేటరీల ఆమోదం పొందిన తొలి టీకా స్పుత్నిక్ వీ రెండు, మూడో దశ ట్రయల్స్ భారత్‌లో వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి బ్యాచ్ స్పుత్నిక్ వీ టీకాలు వచ్చేవారంలోగా కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీకి చేరనున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకా ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీకా ట్రయల్స్ వచ్చేవారం నుంచి మొదలవుతాయని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్‌బీ కమల్ తెలిపారు. ఇప్పటికే 180 మంది వాలంటీర్లు తమ పేర్లను నమోద చేసుకున్నారని, వీరిపై టీకాను డోసులవారీగా ప్రయోగించి వారి ఆరోగ్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్టు వివరించారు. 21 రోజుల వ్యవధి ఒకసారి(కనిష్టంగా ఒకసారి, గరిష్టంగా మూడు సార్లు) డోసును ఇస్తూ ఏడు నెలలపాటు సదరు వాలంటీర్లలో పరిస్థితులను పరిశీలించనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story