- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల అరిగోస.. నిల్వ చేసిన ధాన్యంలో మొలకలు
దిశ, బోథ్: వర్షాకాలం మొదలు అయ్యింది.. రైతులు పొలం భూములను దుక్కి దున్నారు.. విత్తనాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ, రైతు కష్టాలు తప్పడం లేదు. జొన్నలు అమ్మి.. వచ్చిన డబ్బులతో ఇంకో పంటకి పెట్టుబడి పెడుదామంటే తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు పోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పడించిన పంటను ఇంకా కొనుగోలు చేయలేదని వాపోతున్నారు భోథ్ మండల రైతులు. ప్రభుత్వ మద్ధతు ధర రూ. 2620 ప్రకటించినప్పటికీ.. ఇంకా కొనుగోలు మాత్రం చేయలేదని.. దీంతో ప్రైవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రూ. 1000-1200లకు అమ్ముకోలేక నిల్వచేసిన ధాన్యంలో మొలకలు వచ్చాయని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిల్వచేసిన పంట మొత్తానికే చేతికిరాకుండా అవుతోందని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.